ఎటూ తేలని ‘ఖమ్మం ‘ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ? 

తెలంగాణలో ఖమ్మం మినహా మిగిలిన మిగిలిన 16  ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ కాంగ్రెస్.

  ఖమ్మం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో మాత్రం ఒక క్లారిటీ కి రాలేకపోతోంది.

  కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉండడంతో , ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది.

దీంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోంది.

ఇక్కడి నుంచి సీటు ఆశిస్తున్న వారిలో పార్టీకి చెందిన కీలక నేతలు,  వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థి ఎంపిక కష్టతరంగా మారింది.

ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్యకు టికెట్ ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా , మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) తన సోదరుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు పార్టీ అధిష్టానం వద్ద లాభియింగ్ చేస్తున్నారు.

"""/" / వీరితో పాటు ఇంకా చాలామంది కీలక నేతలే తమ కుటుంబ సభ్యులను పోటీకి దింపేందుకు ప్రయత్నిస్తూ ఉండడం తో,  ఖమ్మం మినహా మిగిలిన అన్ని స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

  అయితే ఇక్కడ నుంచి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీనే ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది .

ప్రస్తుతం ప్రియాంక( Priyanka Gandhi ) అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది .

పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి ముందుగా సోనియాగాంధీతోనే పోటీ చేయించాలనే ప్రతిపాదన తెలంగాణ కాంగ్రెస్ నుంచి వచ్చింది.

ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడ నుంచి సానుకూల స్పందన రాలేదు.పైగా సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు .

దీంతో ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

"""/" / అయితే మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు ఇప్పుడు ఖమ్మం సీటు విషయంలో తెరపైకి వచ్చింది.

అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయాలంటే.రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానాలపై ఆధారపడి ఉండబోతుంది.

వయానాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఇప్పుడూ ఆ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు.

వయోనాడ్ తో పాటు , యూపీలోని అమేధీ నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  అదే జరిగితే ఉత్తరాది దక్షిణాది రెండిటి నుంచి రాహుల్ గాంధీ ( Rahul Gandhi )పోటీ చేసినట్లు అవుతుంది.

ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది , దక్షిణాది రెండు స్థానాల నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

  యూపీలోని రాయి బరేలి, ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తోందట.

ప్రియాంక విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తరువాత ఖమ్మం అభ్యర్థి విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సబ్బు ఎంత పనిచేసింది.. ఏకంగా మూడంతస్థుల మేడ మీద నుండి..