మాస్టర్స్ అథ్లెటిక్ ను అభినందించిన పోలీస్ కమిషనర్
TeluguStop.com
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్
చాంపియన్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పి రమేష్ బాబు ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అభినందించారు.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని విశ్వసించే రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పి.
రమేష్ బాబు నిరంతరం క్రీడలు, వ్యాయామం సాధన చేస్తూ ఇటీవల భూపాలపల్లి మరియు హన్మకొండ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 8వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు పాల్గొన్నారు.
35 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు వయో వర్గాల కోసం 17 ఈవెంట్‌లు పోటీలు నిర్వహించారు.
20 జిల్లాల నుండి 800 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు.100 మీటర్లు, 5 కిమీ రన్ & వాక్ మరియు లాంగ్ జంప్ పోటీలు ప్రధమ , ద్వితీయ స్ధానంలో పతకాలు సాధించిన పి.
రమేష్ బాబు ను పలువురు అభినందించారు.
ఈ ఆమ్లా జ్యూస్ ను వారానికి 2 సార్లు తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు!