ఖమ్మం బీఆర్ఎస్ సభ రాజకీయాల్లో పెద్ద మలుపు..: మంత్రి హరీశ్ రావు

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే తొలి బహిరంగ సభ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కేంద్రం కాఫీ కొట్టి అమలు చేస్తోందని విమర్శించారు.

వ్యవసాయంలో మార్పులు తెస్తామని చెప్పి బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి కార్పొరేటీకరణ చేసిందని ఆరోపించారు.

బీజేపీ హయాంలో ఆదాయం తగ్గి రైతుల పెట్టుబడి పెరిగిందని తెలిపారు.750 మంది రైతులను పొట్టన బెట్టుకున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు.