కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదం.. చర్యలు తీసుకోవాలని ట్రూడోను కోరిన మోడీ, గంటల వ్యవధిలోనే రెఫరెండం

కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదుల( Khalistan ) ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలతో పాటు ఏకంగా ఖలిస్తాన్‌పై రెఫరెండం( Khalistan Referendum ) నిర్వహిస్తున్నారు.

మొన్నామధ్య భారతీయ దౌత్యవేత్తలను టార్గెట్ చేస్తూ పోస్టర్లు అంటించారు.ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ఆందోళన వ్యక్తం చేసింది.

తాజాగా జీ20 సమ్మిట్‌లో( G20 Summit ) పాల్గొనేందుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తాన్ ఆందోళనలు, కెనడాలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలను తీసుకెళ్లారు.

తీవ్రవాద అంశాలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని.భారత దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.

వేర్పాటువాదులు దౌత్య ప్రాంగణాలను దెబ్బ తీస్తున్నారని.కెనడాలోని( Canada ) పౌర సమాజాన్ని, వారి ప్రార్ధనా స్థలాలను బెదిరిస్తున్నారని ట్రూడోతో( Justin Trudeau ) మోడీ( PM Modi ) శనివారం తీవ్ర స్వరంతో తెలియజేశారు.

దీనిపై ట్రూడో స్పందిస్తూ.కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ, శాంతియుత నిరసన స్వేచ్ఛ హక్కులను కాపాడుతుందన్నారు.

హింసను నిరోధించడంతో పాటు విద్వేషానికి వ్యతిరేకంగా చర్యలూ తీసుకుంటామని ట్రూడో స్పష్టం చేశారు.

ఓ వర్గం ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు.మొత్తం ఆ వర్గానికి, లేదా కెనడాకు ప్రాతినిథ్యం వహించవని ట్రూడో అన్నారు.

"""/" / ఇకపోతే.ఆదివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గురునానక్ గురుద్వారా ఆవరణలో ఖలిస్తాన్‌పై రెఫరెండం జరిగింది.

ఇదే ప్రాంతంలో ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

నిషేధిత ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)( Sikhs For Justice ) ఈ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది.

ఈ కార్యక్రమానికి 1,00,000 మందికి పైగా సిక్కులు హాజరయ్యారని గ్లోబల్ న్యూస్ ఛానెల్ నివేదించింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌జే నేత జతీందర్ గ్రేవాల్ మాట్లాడుతూ.ఖలిస్తాన్ సమస్య చాలా మంది సిక్కుల హృదయాలను, మనస్సులను తాకే లోతైన సమస్య అన్నారు.

"""/" / నిజానికి బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో వున్న ‘‘తమనావిస్ సెకండరీ స్కూల్‌లో’’( Tamanawis Secondary School ) ఖలిస్తాన్ రెఫరెండం జరగాల్సి వుంది.

ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ అతికించిన పోస్టర్లపై ఆయుధాలు, తుపాకులు వున్నట్లు స్థానికులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన యాజమాన్యం .ఆ పోస్టర్‌లను తొలగించాల్సిందిగా పలుమార్లు రెఫరెండం నిర్వాహకులను కోరింది.

అయినా అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెఫరెండంను రద్దు చేస్తున్నట్లు సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రకటించింది.

దీంతో వేదికను మరోచోటికి మార్చాల్సి వచ్చింది.

గూగుల్ నాయకత్వంలో పెను మార్పులు చేసిన సుందర్ పిచాయ్