చవితి వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ గణపయ్య
TeluguStop.com
వినాయకచవితి పండుగను పురస్కరించుకుని ఖైరతాబాద్ గణపయ్య నవరాత్రులకు సిద్ధమయ్యాడు.బొజ్జ గణపయ్య విగ్రహం తయారీ పూర్తి అయింది.
కాగా, ఈ సంవత్సరం శ్రీ పంచముఖి లక్ష్మీ మహాగణపతి రూపంలో ఆయన భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు.
ఖైరతాబాద్ గణేషుని విగ్రహా తయారీ పనులు జూన్ 10 న ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
అయితే ఈసారి గణపయ్య 50 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్నాడు.కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామీ, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుతీరారు.
60 ఏళ్లలో మొదటిసారిగా ఖైరతాబాద్ గణనాథుడిని మట్టితో తయారు చేయడం విశేషం.
పొరపాటున కాకితో పెట్టుకున్నారో.. 17 ఏళ్లు నరకమే.. ఎందుకంటే..