ఖైదీ నెం.150 లో ఆ స్టార్ హీరో విలన్ గా చేయాల్సింది ఆయన ఎవరంటే..?
TeluguStop.com
చిరంజీవి రీ ఎంట్రీ సినిమా గా వచ్చిన ఖైదీ నెం.150 సినిమా చిరంజీవి క్రేజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించిన సినిమా.
ఈ సినిమా కి వి వి వినాయక్ డైరెక్టర్ కాగా, రామ్ చరణ్ ప్రొడ్యూసర్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం తో పాటు చిరంజీవి కంబ్యాక్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అనే చెప్పాలి.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి.
"""/"/
అయితే ఈ సినిమా లో మెయిన్ విలన్ గా మొదట రాజశేఖర్ నేను చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాను అని చెప్పినప్పటికీ డైరెక్టర్ వి వి వినాయక్ మాత్రం ఆయన్ని కాదని వేరే వాళ్ళని పెట్టీ ఈ సినిమా తీశాడు ఎందుకు రాజశేఖర్ ని ఈ సినిమాలో విలన్ గా తీసుకోలేదు అంటే ఆయన ఇమేజ్ కి సరిపడా క్యారెక్టర్ ఇది కాదని ఆ మూవీ టీమ్ వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"""/"/
ఇక ఇది ఇలా ఉంటే ఆ తర్వాత రాజశేఖర్ గరుడ వేగ సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమా తరువాత మళ్ళీ రాజశేఖర్ క్రేజ్ ఒక్కసారి గా పెరిగిపోయింది దాంతో యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కి సినిమా చేసినప్పటికీ అది పెద్దగా వర్క్ ఔట్ కాలేదు దాంతో ప్రస్తుతం రాజశేఖర్ ఎలాంటి సినిమా చేయాలి అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది.
మళ్ళీ ఒక మంచి కథ తో హిట్టు కొట్టాలనే ఈ గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?