హిట్ సినిమాను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న స్టార్ హీరోలు

ఆయా భాషల్లో హిట్ అయిన సినిమాలను మరికొన్ని భాషల్లోకి రీమేక్ చేయడం సాధారణం.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు.ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్ కొట్టినా.

ఆ సినిమాను మిగతా భాషల్లోకి రీమేక్ చేసి లాభాలు గడిస్తారు దర్శక నిర్మాతలు.

కొన్ని సినిమాలను డబ్ చేస్తే.మరికొన్ని సినిమాలను రీమేక్ చేస్తారు.

ఆయా సినిమాల స్థాయిని బట్టి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుంటారు.అయితే తమిళ సినిమాను తెలుగులోకి చిన్న రాజాగా తెరకెక్కించాడు.

ఈ సినిమా విజయం అందుకుంది.అలాగే అబ్బాయి గారు అనే పేరుతో వెంకటేష్ హీరోగా ఇదే సినిమాను తీశాడు.

ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది.అలాగే పలు సినిమాలు ఇలాంటి కోవలోకి చెందినవి ఉన్నాయి.

అటు 1992లో మమ్ముట్టి హీరోగా మలయాళంలో కౌరవ్ అనే సినిమా వచ్చింది.ఇదే సినిమాను తెలుగులో కంకణం పేరుతో తెలుగులో డబ్ చేశారు.

అయితే ఇక్కడి జనాలు కూడా ఈ సినిమాను బాగానే ఆదరించారు.ఆ సినిమాను గమనించిన మోహన్ బాబు కౌరవ్ ని రీమేక్ చేయాలనుకున్నాడు.

అటు ఖైదీగారు పేరుతో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు కూడా.సాయి ప్రకాష్ దర్శకుడిగా ఈ సినిమా చేశాడు.

ఇందులో క్రిష్ణం రాజు కీలక పాత్ర చేశాడు. """/"/ అటు మాస్ జనాలను ఆకట్టుకునేందుకు లైలానే కూడా ఈ సినిమాలో తీసుకున్నారు.

కోటి సంగీతం అందించాడు.తన బిడ్డ చావుకు పోలీస్ కారణం అయ్యాడని.

ఓ గ్యాంగ్ స్టర్ భావిస్తాడు.అతడు జైలు నుంచి బయటకు వచ్చాక పోలీసు అధికారిని చంపేదుంకు ప్రయత్నిస్తాడు.

ఆయనను చంపేస్తాడు కూడా.కానీ తన బిడ్డ చనిపోలేదని తెలుసుకుంటాడు.

అక్కడి నుంచి తన బాస్ మాఫియా డాన్ నుంచి తన కూతుర్లను కాపాడే బాధ్యత తీసుకుంటాడు.

మలయాళంలో ఈ సినిమా బాగా జనాదరణ పొందింది.అయితే తెలుగుకు వచ్చే సరికి జనాలకు అంతగా నచ్చలేదు.

1998లో వచ్చిన ఖైదీగారు యావరేజ్ గా నిలిచింది.

ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!