ఖబడ్దార్.. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు..: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను ఏ పార్టీలో ఉన్నా గత ప్రభుత్వ నిర్ణయాలపైనే పోరాడానని తెలిపారు.గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్ఎస్సేనని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

తాను పార్టీ మారితే పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేశానని తెలిపారు.

తన మీద దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.ఈ క్రమంలో ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు.

మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు.

ప్రజల కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ అప్పులు చేయలేదని చెప్పారు.కేవలం అభివృద్ధి పేరుతో కమీషన్ల కోసం అప్పులు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అల్లు అర్జున్ కేసు వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?