కె.జి.ఎఫ్ యశ్ నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కె.జి.

ఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా సత్తా చాటాడు యశ్ ఇక కె.

జి.ఎఫ్ తర్వాత అతను ఎవరితో సినిమా చేస్తాడా అన్న కన్ ఫ్యూజన్ మొదలైంది.

యశ్ తో సినిమాకు చాలామంది కన్నడ, సౌత్ దర్శకులు ప్రయత్నించగా ఫైనల్ గా ఒక దర్శకుడికి యశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

యశ్ కె.జి.

ఎఫ్ 2 తర్వాత నర్తన్ అనే కన్నడ దర్శకుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

కన్నడలో స్టార్ డైరక్టర్ గా సత్తా చాటిన నర్తన్ శివరాజ్ కుమార్, శ్రీమురళి కాంబినేషన్ లో వచ్చిన మఫ్తీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక కె.జి.

ఎఫ్ తర్వాత యశ్ తో సినిమా చేసేందుకు ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసుకున్నాడట.

యశ్ కి కథ నచ్చడంతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

అంతేకాదు యశ్ తో కె.జి.

ఎఫ్ నిర్మాతలే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట.తెలుగు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా యశ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నారని టాక్.

Meal : భోజనం చేసిన ప్లేటులోనే చెయ్యి కడగడం మంచిదా..!