పవన్ కళ్యాణ్ కి జోడీగా కేజీఎఫ్ హీరోయిన్
TeluguStop.com

పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసిన కన్నడ భామ శ్రీనిధి శెట్టి.


మొదటి సినిమాతోనే అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ భామ అందులో చేసిన పాత్ర చిన్నదే అయిన మంచి గుర్తింపు మాత్రం వచ్చింది.


దీంతో రెండో సినిమానే ఏకంగా చియాన్ విక్రమ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.
కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ గురించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించబోతుందని టాక్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ తో పాటు, క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్ దర్సకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా హరీష్ శంకర్ శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే ఆమెకి స్టొరీ నేరేట్ చేయడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించడానికి ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
దీనికి సంబందించిన అఫీషియల్ సమాచారం బయటకి ఇంకా రాకున్న త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్3, గురువారం 2025