నాన్న ఇంకా పని చేస్తున్నాడు.. అమ్మ ఆటో, సిటీ బస్’లోనే ప్రయాణిస్తుంది: యష్
TeluguStop.com
ఒకే ఒక్క సినిమా కన్నడ నటుడు యశ్ జీవితాన్ని మార్చేసింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలియంది కాదు.
పిరియాడికల్ మూవీగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ కన్నడ రాక్ స్టార్ యశ్ దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం కేజీఎఫ్ -2 షూటింగ్ లో బిజీగా ఉన్న యశ్ ఈ స్థాయికి రావాడం వెనుక ఎంతో కష్టం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కర్ణాటక భువన హళ్లికి చెందిన అరుణ్ కుమార్, పుష్పలత దంపతులకు కుమారుడే ఈ యశ్.
యశ్ తండ్రి అరుణ్ కుమార్ కేఎస్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.తల్లి పుష్పలత గృహిణిగా ఉన్నారు.
సాధారణంగా స్కూల్లో టీచర్స్ పిల్లలు పెద్దయిన తరువాత ఏమవుతారని అడిగితే డాక్టర్, పోలీస్ అని చెబుతారు.
కానీ యశ్ మాత్రం నేను హీరోనవుతానని చెప్పాడు.దీంతో తోటి విద్యార్ధులు నవ్వడం మొదలు పెట్టారు.
అప్పుడే యశ్ నిజంగానే హీరో అవ్వాలని అనుకున్నాడట.స్కూల్ విద్యార్ధి దశలో ఉన్న యశ్ కు నటనపై ఇంట్రస్ట్ పెరిగింది.
పీయూసీ కంప్లీట్ చేసిన తరువాత తల్లిదండ్రుల సపోర్ట్ తో సినిమాల్లోకి రావాలని అనుకున్నాడు.
కానీ చదువు మానేస్తానంటే ఇంట్లో ఒప్పుకోరని.వాళ్లకు చెప్పకుండా రూ.
300తో ఇంటి నుంచి బెంగళూరు పారిపోయాడు.బెంగళూరు వెళ్లి చాలారోజులు కష్టపడ్డాడు.
ఓ థియేటర్ ట్రూప్ లో జాయిన్ అయితే వాళ్లకి సిగరెట్లు, మందు అందించాడు.
ఓ రోజు ఆ ట్రూప్ లో ఆర్టిస్ట్ రాకపోవడంతో యశ్ కు అవకాశం వచ్చింది.
ఆ తరువాత నాటకాలు వేసుకుంటుండగా పరిచయాలు పెరిగాయి.ఆ పరిచయాలతో కన్నడ సీరియల్ నందగోకులతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు.
నెమ్మదిగా సీరియల్స్ పెరిగాయి.సినిమా ఆఫర్లు వచ్చాయి.
అలా 2008లో యశ్ కు తొలి సినిమా మొగ్గిన మనసులు చిత్రంలో సహనటుడిగా అవకాశం వచ్చింది.
ఆ క్యారెక్టర్ కు ఫిల్మిం ఫేర్ అవార్డ్ దక్కింది.ఆ తరువాత తొలిసారి రాకీ అనే చిత్రంలో హీరోగా అదరగొట్టాడు.
అలా మొదలైన ప్రస్థానం 2014 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.
హీరోగా ఎంత ఎత్తుఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఈ రాక్ స్టార్ ది.
ఓ వైపు స్టార్ హీరోగా మరోవైపు సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు.అయితే యాష్ పాన్ ఇండియా హీరో అయినా ఇప్పటికి తండ్రి అరుణ్ కుమార్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారట.
తల్లి కూడా స్టార్ డమ్ ను ఇష్టపడకుండా ఇప్పటికి సామాన్య జీవితాన్నే ఆస్వాదిస్తున్నారట.
ఇప్పటికి యాష్ తల్లి పుష్పలత ఆటోలో, బస్సులోనే ప్రయాణం చేస్తుందట.చాలా గ్రేట్ కదా!.
కొంచెం కంటెంట్ మీద ఫోకస్ పెట్టాండయ్య…లేకపోతే ఇక అంతే సంగతి…