Archana Jois : కేజీఎఫ్ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి.. అర్చన జైస్ కామెంట్స్ వైరల్!

కేజిఎఫ్.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ రాబట్టింది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సినిమాలోని ప్రతి పాత్ర అభిమానులను బాగా ఆకట్టుకుంది.అయితే అన్నీ పాత్రల్లలో కల్లా రాఖీభాయ్​తో పాటు అమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలను ఎక్కువగా అందుకుంది.

ఆ అమ్మ పాత్ర చేసిన నటి అర్చ‌న జైస్.అయితే ఈ పాత్ర కోసం తనను బలవంతం చేసి ఎలా ఒప్పించారో మరోసారి చెప్పిదామె.

"""/" / ఈ సినిమా తర్వాత ఆమెకు పాపులారిటీ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా ఈ సినిమాలో అమ్మ పాత్రలో నటించిన అర్చన జైస్( Archana Jois ) ఈ సినిమాలో తన పాత్ర గురించి, తనను ఏ విధంగా ఒప్పించారు అన్న విషయం గురించి తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు 20, 21 ఏళ్లు ఉంటాయి.

టీమ్ కాల్​ చేసి ఛాన్స్ ఉందని చెబితే షాక్​ అయ్యాను.నా వయసు తెలుసా? అమ్మా క్యారెక్టరా? అని అన్నాను.

నిజానికి అప్పుడు కథ కూడా వినడానికి సిద్ధంగా లేను.చాలా ఒప్పించడానికి ప్రయత్నాలు చేశారు.

కానీ ఆ తర్వాత ఓ కామన్​ ఫ్రెండ్​. """/" / కనీసం స్క్రిప్ట్ అయినా విను, పెద్ద ప్రొడక్షన్ హౌస్​ నుంచి వచ్చినా ఆఫర్​ కదా అని చెబితే కథ విన్నాను.

కథ విన్నాక కూడా అంత ఎగ్జైట్ అనిపించలేదు.అయినా ఇక ఆ తర్వాత చేసేశాను.

నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్​.కానీ ఇప్పుడు కేజీయఫ్​ సాధించిన విజయం, అందులో నా పాత్రకు దక్కిన ఆదరణ ఎంతో ఆనందంగా ఉంది అని అర్చన తెలిపింది.

ఇకపోతే కేజీయఫ్​ తర్వాత తన లైఫ్​ ఎలా మారిందో కూడా వివరించింది అర్చన.

నాకు యశ్​( Yash )తో ఎటువంటి సన్నీవేశాలు లేవు.రెండో భాగంలో ఒకటే ఉంటుంది.

కాబట్టి ఆయనతో చేసిన సీన్​ కోసం ఏమీ ప్రాక్టీస్​ చేయలేదు.కేజీయఫ్​( KGF ) తర్వాత పర్సనల్​ లైఫ్ అలానే ఉంది.

ప్రొఫెషనల్​ లైప్ మాత్రం చాలా మారింది.పాపులారిటీ ఫేమ్ దొరికింది.

సినిమా అవకాశాల విషయానికొస్తే అలాంటి అమ్మ పాత్రలే వస్తున్నాయి.కానీ మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని అర్చన తెలిపింది.

మాట వినాలంటున్న ‘హరి హర వీరమల్లు’.. పవన్ పాట విన్నారా?