కేజీఎఫ్ అట్టర్‌ఫ్లాప్‌కు అసలు కారణం ఇదే!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.

దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

ఇక ఈ సినిమాను తెలుగునాట ఇటీవల టీవీలో ప్రసారం చేశారు.అయితే ఈ సినిమాకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఈ సినిమాను స్టార్ మా ఛానల్ టెలికాస్ట్ చేయగా దీనికి కేవలం 11.

9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.ఈ లెక్కన ఈ సినిమా బుల్లితెరపై ఫ్లాప్‌గా నిలిచిందని చెప్పాలి.

అయితే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకోలేదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే 2018లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2019లో కూడా తన హవాను కొనసాగించింది.

కానీ ఈ సినిమాను 2020లో బుల్లితెరపై టెలికాస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఇప్పటికే పలు మాధ్యమాల్లో వీక్షించేశారు.

ఇక ఈ సినిమాను చూడని వారు కూడా బుల్లితెరపై ప్రసారమయ్యే సమయానికి ఈ సినిమాపై ఆసక్తిని కోల్పోయారు.

మొత్తానికి ‘ఆలస్యం అమృతం విషం’ అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణగా ఈ సినిమా నిలిచిందని చెప్పాలి.

ఏదేమైనా కేజీఎఫ్ ఆలస్యమేఈ సినిమాకు ఎదురుదెబ్బగా మారింది.

ముద్రగడ ‘ పై కుమార్తె ఫైర్.. పవన్ కు మద్దతు