కేజీఎఫ్2 మూవీలో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన వ్యక్తి ఇతనే.. అలా ఛాన్స్ దక్కిందంటూ?

పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమా సక్సెస్ లో డైలాగ్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి.

కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు ఒక విధంగా డైలాగ్స్ ప్రాణం పోశాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసిన వ్యక్తి పేరు హనుమాన్ చౌదరి కాగా బీస్ట్ సినిమా తెలుగు వెర్షన్ కు కూడా హనుమాన్ చౌదరి డైలాగ్ రైటర్ గా పని చేశారు.

కేజీఎఫ్2 సినిమాలోని ఒక్కో డైలాగ్ మాటల తూటాలా పేలిందనే సంగతి తెలిసిందే.సినిమాలోని డైలాగ్స్ విన్న ప్రేక్షకులకు ఒక డబ్బింగ్ సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్ అస్సలు కలగలేదు.

కేజీఎఫ్2 డైలాగ్స్ సందర్భానికి అనుగుణంగా అద్బుతంగా ఉన్నాయని పాత్రల యొక్క స్వభావాన్ని చెప్పడంలో డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు.

కేజీఎఫ్2 కన్నడ వెర్షన్ డైలాగ్స్ ను ప్రశాంత్ నీల్, యశ్ రాశారని సమాచారం.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సినిమా ఉంది.

రికార్డు స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తుండగా 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది.

"""/" / హనుమాన్ చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేశానని ఆయన తెలిపారు.

కైకాల సత్యనారాయణ కొడుకు ద్వారా తనకు ప్రశాంత్ నీల్ ను కలిసే ఛాన్స్ దక్కిందని హనుమాన్ చౌదరి వెల్లడించారు.

"""/" / కేజీఎఫ్ డైలాగ్ లను నేటివిటీని దృష్టిలో పెట్టుకుని రాయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ సూచనలు చేశారని ఆయన సూచనలను దృష్టిలో పెట్టుకుని తాను సినిమాకు డైలాగ్స్ రాశాయని ఆయన చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్2 సక్సెస్ తో హనుమాన్ చౌదరికి మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

అమెజాన్ అడవిలో సంచరిస్తున్న ఓ అరుదైన తెగ ఇదే?