సెప్టెంబర్ లో ప్రేక్షకులని పలకరించబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ కి కొనసాగింపుగా చాప్టర్2 వస్తున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ కేజీఎఫ్ చాప్టర్ 2ని ప్రశాంత నీల్ తెరపై ఆవిష్కరించారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచేసింది.

కేజీఎఫ్ సీక్వెల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

అలాగే పాజిటివ్ బజ్ కూడా విపరీతంగా ఉంది.ఎప్పుడు రిలీజ్ అయిన హిట్ గ్యారెంటీ అనే మాట చాలా మంది నోట వినిపిస్తుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ విజన్ ప్రేక్షకులని కట్టిపడేస్తుందని భావిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా సెకండ్ వేవ్, లాక్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.

ఈ సెకండ్ వేవ్ లేకుండా ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ రోజే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేది.

అయితే ప్రస్తుతం రిలీజ్ చేసే పరిస్థితి లేదు.ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ నుంచి ఉపశమనం లభించడంతో ఈ సినిమా రిలీజ్ పై నిర్మాతలు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అవకాశం చూసుకొని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు.

త్వరలో డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట కన్నడనాట వినిపిస్తుంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీతో ఏకంగా 500 కోట్ల కలెక్షన్ కి చిత్ర నిర్మాతలు టార్గెట్ పెట్టినట్లు సమాచారం.

సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?