కేజిఎఫ్ సంచలన రికార్డ్.. 17 మిలియన్స్.. ఇది చెరపడం సాధ్యమేనా..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.

కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.

దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్లను అందుకున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

ట్రిపుల్ ఆర్ కంటే ఎక్కువ రాబట్టి ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు మరొక అరుదైన ఘనత అందుకుని మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

"""/" / ఈ రికార్డ్ విషయంలో మాత్రం టాప్ 1 గా నిలిచింది.

దీంతో కెజిఎఫ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ రికార్డ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.

ప్రముఖ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో కేజిఎఫ్ 2 సినిమా ఏకంగా 17 మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయాయట.

ఈ రేంజ్ మరే సినిమా కూడా టికెట్స్ అమ్ముడు పోలేదు.చాలా బుకింగ్స్ అప్షన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక్క బుక్ మై షోలోనే ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం నిజంగా సంచలనం అనే చెప్పాలి.

ముందు ముందు కూడా ఏ స్టార్ హీరో అందుకోలేని గొప్ప రికార్డ్ క్రియేట్ చేసారు.

ఆస్కార్ లైబ్రరీ… చంద్రబోస్ తలపెట్టిన మహాయజ్ఞం.. కుప్పలుగా విరాళాలు