మెగా హీరోతో టాలీవుడ్ లోకి లాంచ్ అవుతున్న కేజీఎఫ్ భామ

కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రీనిధి శెట్టి.

ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్న హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు క్రియేట్ చేసింది.

చేసిన మూడు సన్నివేశాలలో కూడా ఎరోగెంట్ క్యారెక్టర్ లో తన టాలెంట్ చూపించింది.

ఈ సినిమా ఎఫెక్ట్ తో ఏకంగా చియాన్ విక్రమ్ తో కోబ్రా మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

అ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.కన్నడంలో కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధికి కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ లాంటి స్టార్ హీరో సినిమాతో తెరంగేట్రం చేసే అవకాశం లభించింది.

ఇప్పుడు టాలీవుడ్ అలాంటి గ్రాండ్ లాంచింగ్ ఈ అమ్మడుకి లభించబోతుందని తెలుస్తుంది.అది కూడా మెగా ఎంట్రీ అని చెప్పుకుంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

ఆచార్య సినిమాలో తండ్రి చిరంజీవితో జత కట్టబోతున్న రామ్ చరణ్ తరువాత బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

మలయాళీ హిట్ మూవీ రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.

మల్టీ స్టారర్ గా ఉన్న ఈ సినిమాలో బాబాయ్ పవర్ స్టార్ తో కలిసి తాను నటించాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు.

ఈ సినిమా కోసం శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోనివాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

అదే జరిగితే కేజీఎఫ్ భామకి తెలుగులో కూడా గ్రాండ్ లాంచ్ దొరికినట్లే అవుతుంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?