బాలయ్యకు జోడిగా కేజిఎఫ్ బ్యూటీ… లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు తాజాగా ఈయన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.అలాగే నటి శ్రీ లీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

"""/" / ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబి( Bobby ) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని అధికారకంగా ప్రకటించడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది .ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించే హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.

"""/" / ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty ) నటించబోతున్నారని తెలుస్తోంది.

కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీనిధి బాలయ్య సినిమాలో నటించే అవకాశం అందుకున్నట్టు సమాచారం మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.

ఇక ఈ సినిమా ఎప్పటిలాగే యాక్షన్ సీక్వెన్స్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పాలిటిక్స్ నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది.

విద్యార్థుల్లో అలాంటి ప్రతిభ చూసి పేరెంట్స్ షాక్.. వీడియో వైరల్..