కేజీఎఫ్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
TeluguStop.com
కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకు వారు బ్రహ్మరథం పట్టారు.
కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పా్న్స్ రావడంతో ఈ సినిమా సీక్వెల్‌ను చిత్ర యూనిట్ ప్రస్తుతం తెరకెక్కిస్తోంది.
కేజీఎఫ్ చాప్టర్ 2 పేరుతో తెరకెక్కుతున్న సీక్వల్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వినిపించినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
ఇక ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
కాగా తాజాగా ఈ టీజర్ రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారట.
అయితే ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో యశ్ రాకీ భాయ్ పాత్రలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరి ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ ఈసారైనా అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తారా? జగ్మీత్ సింగ్ వ్యూహం ఏంటీ?