కేజీఎఫ్-2 నిర్మాతకు కండిషన్ పెట్టిన దిల్ రాజు!
TeluguStop.com
కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.
ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ ను సాధించింది.కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా.
.చాప్టర్ 2 తో తెరకెక్కనుంది.
సస్పెన్షన్ గా మారిన ఈ సినిమా చాఫ్టర్ 2 లో ఏ విధంగా ఉంటుందో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.భారతీయ భాషల్లో మే 30న విడుదల చేయడానికి సినీ నిర్మాతలు నిర్ణయించారు.
కాగా ఈ విషయం త్వరలోనే పూర్తి సమాచారంతో తెలుపన్నున్నారు.ఇక ఈ సినిమాకు ఉన్న డిమాండ్ తెలుగు రైట్స్ లోనే ఎక్కువగా ఉంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ సినీ నిర్మాతలు తెలుగు రైట్స్ కి పెద్ద మొత్తంలో అమ్మారు.
ఈ విధంగా తెలుగు రైట్స్ లో బిజినెస్ చూడగా ఈ రాష్ట్రాల నుండి రూ.
60 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు .నైజాం ఏరియా రైట్స్ కు భారీ బెట్టింగ్ పెట్టడం జరుగుతుంది.
కాగా ఈ సినీ నిర్మాతలు విడుదల డేట్ విషయం గురించి డిస్ట్రిబ్యూట్ చేసే పంపిణీదారులకు తెలియజేశారు.
"""/"/
తెలుగు సినీ దర్శకుడు దిల్ రాజ్ పంపిణీదారులలో ఒకరు.నైజాం ఏరియా కు తెలిపిన రేటు విషయం విని ఆశ్చర్యపోయాడు.
ఈ కరోనా సమయంలో ఇంత రేటు దిల్ రాజు ఊహించినలేదట.కాగా ఈ విషయం గురించి కొనాలా.
వద్ద.ఆలోచనలో ఉన్న దిల్ రాజు ఓ కండిషన్ పెట్టాడట.
వాళ్లు చెప్పిన రేటు ఒప్పుకుంటున్నాను అని ఒకవేళ అనుకున్న స్థాయిలో సినిమా ఆడకపోతే జరిగిన నష్టానికి రికవరీ చేయాలని అగ్రిమెంట్ చేయాలని కోరాడట.
కానీ ఈ అగ్రిమెంటు కు ఈ సినీ నిర్మాతలు ఒప్పుకోలేదు.నిజానికి కేజిఎఫ్ నిర్మాతలు భారీ అంచనాలు వేయగా.
చాప్టర్ 1 కంటే.చాప్టర్ 2 కు ఏడు రెట్లు పెట్టుబడి పెట్టమన్నా విషయాన్ని తెలిపారు.
కాబట్టి ఇంత పెట్టుబడికి ఆ మాత్రం అన్న లాభం రాదా.అన్నట్లు సినీ నిర్మాతలు తెలుపుతున్నారు.
మొత్తానికి ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధం కాగా.అసలు డేట్ కోసం ఎదురు చూడాలి.
నాగ చైతన్య కి అదే మైనస్ గా మారుతుందా..?