'కే జి ఎఫ్ 2' లో నటించడానికి ఈ నటులు తీసుకున్న శాలరీ ఎంతో తెలుసా?
TeluguStop.com
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కే జి ఎఫ్ చిత్రాల హవా కొనసాగుతోంది.
2018 లో కే జీ ఎఫ్ పార్ట్ 1 విడుదల అయింది.అయితే అప్పట్లో ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు.
అప్పటికి ఈ సినిమా డైరెక్టర్ కానీ అలాగే హీరో యశ్ కానీ ఎవరికీ తెలియదు.
అలా థియేటర్ లో విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 1.
ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.విడుదల అయిన ప్రతి సెంటర్ లో అద్బుత రెస్పాన్స్ తో మంచి కలెక్షన్ లను సాధించి మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ 100 శాతం ప్రదర్శన కనబరిచిన కారణంగా ఎంతో మంది ప్రశంసలను అందుకుంది.
ఈ సినిమా ఇచ్చిన విజయం తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో యశ్ లు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.
వీరి నుండి మళ్లీ ఏ సినిమా వస్తుందా అని ఎంతగానో ఎదురుచూశారు అభిమానులు.
అయితే అదే సమయంలో ఈ సినిమాకి కొనసాగింపుగా కే జి ఎఫ్ చాప్టర్ 2 ఉంటుందని ప్రకటించి అభిమానులకు సంతోసాన్ని ఇచ్చే వార్త చెప్పాడు.
దీనితో అప్పటి నుండి ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
అయితే అందరూ అనుకున్నట్లుగానే కే జి ఎఫ్ పార్ట్ 2 ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా మొదటి పార్టీ కు మించి హీరో యశ్ సీన్ లు అద్భుతంగా రాసుకున్నాడు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ యశ్ పై రాసుకున్న డైలాగ్స్ అన్నీ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా కూడా అంచనాలకు మించి హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లు సాధిస్తోంది.
ప్రస్తుతానికి 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కొట్లే లక్ష్యంగా పరుగులు తీస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి.
అందులో ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
ఇంత భారీ బడ్జెట్ మూవీ లో నటించి నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విషయం తెలుసుకోవడానికి అందరూ ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు.
మొదట ఇందులో చెప్పుకోవాల్సింది రాఖీ బాయ్ గా నటించిన యశ్ గురించి.ఈ సినిమాలో హీరోగా నటించినందుకు ఇతనికి 20 నుండి 25 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నుండి వచ్చి సౌత్ సినిమాలో నటించి కే జి ఎఫ్ 2 కే వన్నె తెచ్చిన సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
ఇందులో రాఖీ బాయ్ ను ఎదుర్కొనే అధీరా పాత్రలో 100 శాతం నటించి అందరినీ మెప్పించాడు.
ఈ పాత్ర చేయడానికి గానూ సంజయ్ దత్ 10 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు.
యశ్ మరియు సంజయ్ దత్ ల తర్వాత అంత పవర్ ఫుల్ పాత్ర చేసిన నటి రవీనా టాండన్.
ఈమె ఇందులో ప్రధాన మంది రమికా సేన్ గా నటించి.తనలో ఇంకా నటి ఉందని నిరూపించింది.
ఈమె ఈ పాత్రను చేయడానికి 5 కోట్లు తీసుకుందట. """/"/
ఇక రాఖీ బాయ్ లాంటి గ్యాంగ్ స్టర్ ను సైతం తన అందంతో ఆకట్టుకుని తన మయాలో పడేలా చేసిన రీనా పాత్రలో శ్రీనిధి శెట్టి చాలా చక్కగా నటించింది.
ఈమె ఈ పాత్ర కోసం 2 కోట్ల వరకు తీసుకున్నది అని తెలుస్తోంది.
రాఖీ బాయ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలను తయారుచేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే సీబీఐ అధికారి రఘునందన్ గా రావు రమేష్ నటించారు.
ఇందుకు గాను ఆయన 80 లక్షలు తీసుకున్నారట.ఇందులో మొదటి భాగంలో కథను ముందు తీసుకెళ్లిన అనంత్ నాగ్ కు బదులు తన కొడుకుగా ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు.
ఇందులో ప్రకాష్ రాజ్ విజయేంద్ర గా నటించారు.ఇందుకు గానూ ప్రకాష్ రాజ్ 5 కోట్లు తీసుకున్నాడు.
"""/"/
ఇక ప్రకాష్ రాజ్ చెబుతున్న కథను వింటూ తనకు వచ్చిన డౌట్ లను అడుగుతూ ఉండే దీప హెగ్డే పాత్రలో మల్విక అవినాష్ చేసింది.
ఇందుకు గానూ ఈమె 1 కోటి తీసుకుందట.ఇక ఈ సినిమాలో ఉన్న రెండు చాప్టర్ లలో కథకు ప్రాణం మరియు యశ్ కు ప్రాణం అయిన అమ్మ శాంతి.
ఈ సినిమా చూసిన వారు ఎవ్వరూ ఈమెను మర్చిపోలేరు.ఇందులో ఆమ్మకు సంబంధించిన సెంటిమెంట్ మరియు వీరిద్దరి మధ్య వచ్చే సీన్ లు వేరే లెవెల్ అని చెప్పాలి.
ఈ పాత్ర కోసం జోయిస్ 30 లక్షలు మాత్రమే తీసుకుందట.ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 విజయానికి కీలకంగా మారిన పాత్రలు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే దేవర మూవీ హిట్టైందా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?