కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అవసరం అయితే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని తెలిపారు.
తెలంగాణ యువతకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ వేసి ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామన్న కేటీఆర్ ఇప్పటికే 1.
3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.అదేవిధంగా ప్రవళిక మృతిని కొందరు చిల్లర రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు తమను కలిస్తే ఆదుకుంటామని తెలిపారు.
రోజుకొక ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?