కెసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కొత్త కొత్త పార్టీలు రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి ఉంది.

ఇటీవల పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

ఇక మిగతా ప్రతిపక్షాల లాగానే ప్రవీణ్ కుమార్ కేసీఆర్ టార్గెట్ గా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది .

తాజాగా నిరుద్యోగులకు ప్రభుత్వం నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నారని తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులతో భేటీ అయిన సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది.

అయితే తాజాగా  వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రమంతా రచ్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.

ఈ విషయంపై బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో వరి ధాన్యం కొనుగోళ్ళపై ప్రవీణ్ కుమార్ ఎక్కుపెట్టిన పరిస్థితి ఉంది.

ఇండస్ట్రియల్ పార్కుల పేరిట రైతుల భూములు లాక్కుంటున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ప్రభుత్వాలు రైతులను ఆదుకునే విధంగా వ్యవహరించాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.

అయితే కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి త్వరలోనే బుద్ధి చెబుతారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

అయితే ఇప్పటికైతే ప్రవీణ్ కుమార్ పార్టీపై పెద్దగా ఎవరూ స్పందించిన పరిస్థితి లేదు.

సాధ్యమైనంత వరకు వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా కేసీఆర్ పై ప్రవీణ్ కుమార్ రోజురోజుకు రాజకీయంగా దూకుడు పెంచుతున్న పరిస్థితి ఉంది.

మరి రానున్న రోజుల్లో బీఎస్పీ పార్టీని ఎంత మేర ప్రజల్లోకి తీసుకెళ్తారనేది చూడాల్సి ఉంది.

Keratin Treatment : ప్ర‌తి నెలా కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్లే!