రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం సరికాదన్నారు.

ఆయన చెబితేనే రైతులు రాజధానికి భూములను ఇచ్చారా అని ప్రశ్నించారు.2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని కరివేపాకుల పారేసారని విమర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చారన్న వల్లభనేని వంశీ.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పులో తప్పులేదని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన గౌరవం తగ్గదని చెప్పారు.వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఆయనకున్న ఖ్యాతి పెరగదని స్పష్టం చేశారు.