తండ్రి బాధ్య‌త విష‌యంలో ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌తి మ‌నిషి జీవితంలో తండ్రి ఎంత ముఖ్య‌మో చెప్పాల్సిన ప‌నిలేదు.పిల్లల‌ విష‌యంలో తండ్రి బాధ్య‌త అంద‌రికంటే కీలకం.

వారి ఎదుగుద‌ల‌కు స‌ర్వ‌స్వం ధార‌బోసే తండ్రి ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్యుడు.

అలాంటి తండ్రి పాత్ర‌ను గుర్తు చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది పుట్టిన కొడుకు వ‌య‌సు రీత్యా మేజర్ అయినా కూడా అత‌నికి ఖ‌చ్చితంగా తండ్రి చదువు చెప్పించాల్సిందేనంటూ వ్యాఖ్యానించింది.

ఆ బాధ్యతను ప‌క్క‌న పెట్టేయ‌డానికి తండ్రికి ఆస్కారం లేదంటూ కామెంట్ చేసిది హైకోర్టు.

వ‌యసులో సంబంధం లేకుండా పిల్లలకు చదువు చెప్పించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది.ఇంత‌కీ వివ‌రాల్లోకి వెళ్తే.

ఢిల్లీలో నివసిస్తున్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టును ఆశ్ర‌యించ‌గా అక్క‌డ కొడుకుకు చదువు చెప్పించేందుకు తండ్రి నెల నెలా క‌చ్చితంగా రూ.

15వేలు ఇవ్వాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది.అయితే ఈ తీర్పును ఆ తండ్రి స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌గా దీనిపై కోర్టు బెంచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఇందులో ఆ తండ్రి ఇలా చెప్పాడు.తన కొడుక్కి 18 ఏండ్లు వ‌చ్చే దాకా అయినా చ‌దువు చెప్పిస్తాన‌ని లేదంటే డిగ్రీ వ‌ర‌కు బాధ్య‌త తీసుకుంటాన‌ని ఆ త‌ర్వాత మాత్రం తాను చ‌దువు చెప్పించ‌లేనంటూ ఆ తండ్రి చెప్పాడు.

"""/"/ కాగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన జ‌డ్జీల బెంచ్ పిల్లల విష‌యంలో తండ్రి బాధ్య‌త కీల‌క‌మైంద‌ని, కాబ‌ట్టి కేవ‌లం కొంత వ‌ర‌కు కాకుండా వారి కాళ్ల మీద వారు నిలబడే దాకా ఏదైనా ఆధారం దొరికే దాకా క‌చ్చితంగా చ‌దువు చెప్పించాల్సిందేనంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

అంతే గానీ 18 ఏళ్లు దాటాయ‌ని త‌ల్లి మీద బాధ్య‌త‌ను వ‌దిలేయ‌డం క‌రెక్టు కాదంటూ కామెంట్ చేసింది.

అంతే కాదు కొడుకు సంపాద‌న ఆ తల్లి చేతికి వచ్చే దాకా ఆ బాధ్య‌త‌ను తీసుకోవాల్సిందేనంటూ చెప్పింది కోర్టు.

కాగా ఈ తీర్పును ఇప్పుడు అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ