గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనలో కీలక విషయాలు

గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ వంతెన కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ప్రమాదంపై ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక సిట్ బృందం తన ప్రాథమిక నివేదనకు సమర్పించింది.

బ్రిటీష్ కాలంలో నిర్మించిన మచ్చు నదిపై ఈ వంతెనకు మరమ్మత్తు పనుల అనంతరం గత సంవత్సరమే అక్టోబర్ లో తిరిగి ప్రారంభించారు.

అయితే వంతెన ప్రారంభించిన నాలుగు రోజులకే దుర్ఘటన జరిగి సుమారు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై ఏర్పాటు చేసిన సిట్ బృందం సస్పెన్షన్ బ్రిడ్జి వైర్లు దాదాపు సగానికి పైగా తుప్పు పట్టాయని తెలిపారు.

మరమ్మత్తు సమయంలో పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారని గుర్తించినట్లు నివేదికలో పేర్కొంది.

వంతెన మరమ్మతులు నిర్వహణలో అనేక లోపాలను సిట్ గుర్తించిందని సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్4, బుధవారం 2024