బీజేపీలోకి కీల‌క ఉద్య‌మ నేత‌.. తెర‌వెన‌క ఉన్న‌ది ఎవ‌రు..?

తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఓ వైపు టీఆర్ఎస్ బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంటే.

మ‌రోవైపు బీజేపీలోకి వ‌ల‌స‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది.ఇప్ప‌టికే దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ, హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపుతో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక అటు టీఆర్ఎస్‌లో చాలామంది అసంతృప్త నేత‌లు కూడా ఉన్నారు.దీంతో వారంతా త‌మ‌కు త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌ట్లేద‌నే ఆవేదనతో బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రీ ముఖ్యంగా ఈట‌ల రాజేంద‌ర్ గెలుపుతో వారిలో ధీమా వ‌చ్చిన‌ట్టు అయింది.మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ఎదిరిస్తే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ అయోమ‌యంలో ప‌డుతుందేమో అన్న‌ భావ‌న‌లో ఉన్న వారంతా ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ ఎదిరించి నిల‌వ‌డంతో కొంత ధైర్యం తెచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇలా బీజేపీవైపు చూస్తున్న వారిలో ఎక్కువ‌గా ఉద్య‌మ నేత‌లు ఉన్నార‌ని స‌మాచారం.వారికి స‌ముచిత స్థానం లేక‌పోవ‌డంతో ఈట‌ల దారిలోనే ప‌య‌న‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పుడు ఈట‌ల త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో చాలామంది ఉద్య‌మ నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకొస్తున్నారంట‌.

"""/" / ఆనాడు ఉద్య‌మంలో కీల‌కంగా ప‌నిచేసిన విఠల్ ను బీజేపీలోకి తెస్తున్నారంట ఈటల రాజేంద‌ర్‌.

ఆయ‌న ఉన్నార‌న్న ధీమాతోనే విఠ‌ల్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.టీఎన్జీవో నేత అయిన విఠల్ మొన్న‌టి వ‌ర‌కు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కొన‌సాగారు.

అయితే ఆయ‌న‌కు ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు.దీంతో బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయ్యారంట‌.

ఇక ఈయ‌న చేరిక త‌ర్వాత క్ర‌మంగా టీఎన్జీవో నేత‌లు బీజేపీలోకి వెళ్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఇదే జ‌రిగితే టీఆర్ ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు.మ‌రి కేసీఆర్ ఇప్ప‌టికైనా అలెర్ట్ అవుతారో లేదో చూడాలి.

రోజూ 20 నిమిషాలే పనిచేస్తాడు.. ఏటా రూ.3.8 కోట్లు సంపాదిస్తాడు..?