హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం
TeluguStop.com
హైదరాబాద్ గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం కొనసాగుతోంది.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ మరియు జనరల్ సెక్రెటరీల భేటీ జరుగుతోంది.
ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు.
ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అనంతరం ధరణి రద్దుపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే అంశంపై నేతలను దిశానిర్దేశం చేయనున్నారు.
5వ అంతస్తు నుంచి వాషింగ్ మెషీన్ జారవిడిచిన వ్యక్తి.. తర్వాతేమైందో చూస్తే కడుపుబ్బ నవ్వుతారు!