డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు.గోవాలో ఎడ్విన్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా రాత్రికి ఎడ్విన్ ను పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారు.నారాయణ బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎడ్విన్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

గత 3 నెలలుగా గోవాలోని ఉంటున్న ఎడ్విన్ తప్పించుకుంటూ తిరుగుతున్నారు.ఈ క్రమంలో 15 రోజులు ఎడ్విన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

కాగా డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా ఎడ్విన్ ఉన్నారు.గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైద్రాబాద్ లో సరఫరా చేస్తున్న వారిలో ఎడ్విన్ కీలక వ్యక్తి.

ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?