వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది.
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.అదేవిధంగా సీబీఐ కేసు విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఏప్రిల్ 30తో దర్యాప్తు ముగించాలని గతంలో గడువు విధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు 24 గంటల పాటు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
దీనిపై అంగీకరించని సుప్రీం.సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించింది.
సీబీఐ అరెస్ట్ చేయాలని భావిస్తే ఎప్పుడో చేసి ఉండేదని వెల్లడించింది.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!