కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల స్కీమ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2023- 24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15 వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందజేయనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా స్కీమ్ ఉండనుంది.

ఈ పథకం కోసం కేంద్రం సుమారు రూ.1,261 కోట్లు కేటాయించింది.

పథకం కింద గరిష్టంగా రూ.8 లక్షల మేర ఆర్థికసాయం అందనుంది.

ఐదు రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రం మరో పది రోజుల పాటు డ్రోన్ల ద్వారా వ్యవసాయ సేవలపై శిక్షణ ఇవ్వనుంది.

అలాగే 2023-24 రబీ సీజన్ కోసం ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పొడిగింపుతో పాటు 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

అన్నయోజన పథకం కింద పేద కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, అత్యోందయ పథకం లబ్ధిదారులకు 35 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు అందించనుంది కేంద్రం.

కాగా ఈ పథకం కింద దేశంలో దాదాపు 81 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఆ పాత్రలో మెగాస్టార్ నటిస్తున్నారట.. కానీ?