టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ తో దాడులు చేయిస్తోందని టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఈడీ, బోడీకి తాము భయపడేది లేదన్నారు.ఈడీకి భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆరోపించారు.

వైఎస్ షర్మిల, కేఏ పాల్ ఒక్కటేనని పేర్కొన్నారు.తెలంగాణలోని ఆస్తులు కాపాడుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.