మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాము బాధ్యత గల వ్యక్తులమని చెప్పారు.
తాము ఏం మాట్లాడినా దర్యాప్తును ప్రభావితం చేశామంటారని తెలిపారు.దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడనని పేర్కొన్నారు.
దొంగ ఎవరో, దొర ఎవరో నిన్నటి ఆడియోల్లోనే బయటపడిందన్నారు.రేపిస్టులకే బీజేపీ నేతలు దండలు వేసి ఊరేగిస్తున్నారని ఆరోపించారు.
చట్టాన్ని నమ్ముతున్నామన్న కేటీఆర్.తమ పార్టీ నేతలకు కూడా ఇదే సూచించినట్లు వెల్లడించారు.
ప్రమాణం చేసుకుంటూ పోతానంటే చట్టాలు, కోర్టులు అవసరం లేదు కదా అన్నారు.అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో యాదాద్రిలో ప్రమాణం చేశారని అన్నారు.
ఈ ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ కోరారు.
అలా చేసుంటే దేవరకు రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చేవట.. పరూచూరి కామెంట్స్ వైరల్!