జీపీఎస్ పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలో జీపీఎస్ విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.పాత పెన్షన్ విధానానికి కేంద్రం ఒప్పుకోవడం లేదన్నారు.
సీపీఎస్ రద్దు అనేది ముగిసిన అధ్యాయమని తెలిపారు.సీపీఎస్ రద్దు మన చేతిలో లేని అంశమని మంత్రి బొత్స అన్నారు.
సీపీఎస్ వలన ఉద్యోగులు అందరికీ నష్టమేనన్న ఆయన జీపీఎస్ వలన మేలు జరుగుతుందని చెప్పారు.
అదేవిధంగా జీపీఎస్ అందరికీ ఆమోద యోగ్యం అని తాము చెప్పలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలో సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించారు.
జీపీఎస్ లో ఇంకా ఏదైనా చెప్పదలుచుకుంటే చర్చిస్తామన్నారు.సీపీఎస్ రద్దును ఎందుకు అంగీకరించడం లేదో బీజేపీ వాళ్లను అడగాలని తెలిపారు.
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?