సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు.తమ అవసరం ఉందనుకుంటే తమ దగ్గరకే బీఆర్ఎస్ వస్తుందని తెలిపారు.

అవసరం లేదనుకుంటే ఎవరి దారి వారిదేనని వెల్లడించారు.ఎన్నికలకు సంబంధించి ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదని కూనంనేని తెలిపారు.

బీజేపీని నిలువరించేందుకే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చామని పేర్కొన్నారు.సీపీఐ, సీపీఎంలు కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.

తెలియక మహా కూటమిలో ఇరుక్కుపోయామన్న కూనంనేని.ఈసారి అలా జరగదని స్పష్టం చేశారు.

తమ పార్టీలకు గౌరవ ప్రదమైన స్థానాలు ఇచ్చే పార్టీతోనే కలుస్తామని చెప్పారు.ఈ నేపథ్యంలో పొత్తు పొత్తే.

పోరాటం పోరాటమేనని స్పష్టం చేశారు.

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!