పంతం పట్టిన నాని ? అక్కడ టీడీపీ ఓటమే లక్ష్యంగా …?

విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) టిడిపి పై పగ తో రగిలిపోతున్నారు.

చాలాకాలం నుంచి తనపై కొంతమంది పార్టీ కీలక నాయకులే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా,  వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా,  టిడిపి అధిష్టానం పట్టించుకోలేదని , తాను పార్టీ మేలు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా,  తనను అనుమానంతోనే దూరం పెడుతూ వచ్చారని,  తనకు ప్రత్యామ్నాయంగా కొంతమంది నేతలను ప్రోత్సహిస్తూ తనకు పొగ పెట్టారని నాని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో, టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అంతేకాకుండా తనను ఇన్ని అవమానాలకు గురిచేసిన పార్టీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో నాని ఉన్నారు.

"""/" /  దీనిలో భాగంగానే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం లో టిడిపి( TDP ) ఓటమే లక్ష్యంగా నాని కొత్త అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే అది ఏ పార్టీ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు .

వైసిపి నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నా.ఆ పార్టీలో చేరేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.

ఒకవేళ టీడీపీతో బిజెపి కనుక పొత్తు పెట్టుకోకపోతే, బిజెపి( BJP )లో చేరి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని , ఒకవేళ టీడీపీ , బీజేపీ పొత్తు పెట్టుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా నైనా రంగంలోకి దిగి టిడిపిని ఓడించాలని నాని కంకణం కట్టుకున్నారు.

ఇప్పటికే ముఖ్య నేతలు , తనకు అత్యంత సన్నిహితులతో నాని సమావేశాలు జరుపుతున్నారు.

దీంతో రాబోయే రోజుల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి అని వచ్చే ఎన్నికల్లో తాను గెలిచినా, గెలవకపోయినా టిడిపిని ఓడించాలనేదే తన లక్ష్యమని నాని చెబుతున్నారట .

"""/" / పార్టీలో తనకు జరిగిన అవమానాలను కూడా సమావేశాల్లో ప్రస్తావించి , తనను ఎన్ని రకాలుగా అవమానాలకు గురిచేయాలో అన్ని అవమానాలకు గురిచేసారని , పార్టీలో అందరిని కలుపుకు వెళ్లే విధంగా తాను ప్రయత్నిస్తే.

తనను వేరుగా చూసి పక్కన పెడుతూ వచ్చారని,  తన ఇంట్లో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించడం దగ్గర నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగిన అన్ని విషయాలను వారితో చర్చించారట.

మరి కొద్ది రోజుల్లోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నారు నాని.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్26, గురువారం 2024