మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం..!!
TeluguStop.com

2024 ఎన్నికలలో విజయవాడ వైసీపీ నేత కేశినేని నాని ( YCP Leader Keshineni Nani )ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే.


గతంలో తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.


కానీ 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ క్రమంలో బెజవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని సోమవారం సంచలన ప్రకటన విడుదల చేశారు.
ఇదే సమయంలో తనని రెండుసార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఈ ఎన్నికలలో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో 2.82 లక్షల మెజారిటీ తేడాతో ఓడిపోవడం జరిగింది.
"""/" /
2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది.
దాదాపు 8 జిల్లాలలో వైసీపీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు.11 స్థానాలు మాత్రమే గెలవటంతో.
వైసీపీ( YCP ) పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.ఈసారి తెలుగుదేశం కూటమి బలమైన ప్రభుత్వాన్ని స్థాపించింది.
చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఎన్నికలను ఎదుర్కోవటం జరిగింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు.
చివర ఆఖరికి ఘనమైన విజయాన్ని అందుకున్నారు.జూన్ 12వ తారీకు చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
సిగ్గులేని కుటుంబాలు అంటూ భారతీయులపై ఓ మహిళ జాత్యహంకార కామెంట్స్!