వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు : కేశినేని చిన్ని

వైసీపీ నుంచి కూడా కేశినేని నాని( Keshineni Nani )కి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

కుక్కలకు విశ్వాసం అయినా ఉంటుంది, కానీ నానికి అది కూడా లేదని చురకలు అంటించారు.

ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరాడని.

వైసీపీ( YCP )లో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని( Keshineni Chinni ) ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడు గా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదన్నారు.

ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని.

నాగార్జున వందో సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయిందా..?