ఘనంగా కేరింత హీరోయిన్ పెళ్లి... వైరల్ అవుతున్న ఫోటోలు!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు బుల్లితెర నటీనటులు తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ఇకపోతే తాజాగా మరొక నటి కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
కేరింత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సుకృతి అంబటి.ఈమె నటించిన ఈ ఒక్క సినిమాలో ఆయనప్పటికి ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా సుకృతి కేరింత సినిమాలో భావన పాత్రలో నటించారు.ఈ సినిమా అనంతరం ఈమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు.
విదేశాలలో చదువు పూర్తి చేసుకున్నటువంటి ఈమె తాజాగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా సుకృతి అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా తనుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
"""/"/
ఈ క్రమంలోనే జూన్ నెలలో అక్షయ్ సింగ్ తో కలిసి తన నిశ్చితార్థం జరిగినటువంటి ఫోటోలను షేర్ చేసిన ఈమె గత రెండు రోజుల క్రితం హల్దీ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
అయితే తాజాగా తన ప్రియుడితో కలిసి మూడు ముళ్ళు వేయించుకున్నటువంటి పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.