ఏంది భయ్యా ఇది : జోక్ చేసి 12కోట్లు లాటరీ గెలుచుకున్నాడు…
TeluguStop.com
మామూలుగా మన పెద్దలు పై లోకంలో తథాస్తు దేవతలు ఉంటారని కాబట్టి ప్రతి క్షణం మంచి ఆలోచనలతో మంచి జరగాలని కోరుకుంటూ ఉండాలని మంచి మాటలు చెబుతుంటారు.
అయితే తాజాగా ఓ యువకుడు తనకు లాటరీ వచ్చినట్లు తన స్నేహితులతో ఉదయం సమయంలో సరదాగా జోక్ చేస్తే అది కాస్త సాయంత్రానికల్లా నిజమై దాదాపుగా 12 కోట్ల రూపాయల విలువైన బహుమతులను గెలుచుకున్న ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన ఈడిక్కీ పట్టణ పరిసర ప్రాంతంలో అనంతు విజయన్ అనే 24 సంవత్సరాల కలిగినటువంటి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
అయితే ఈ అయితే ఇటీవలే అనంతు విజయన్ ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తున్న ఓ లాటరీ టికెట్ ను కొన్నాడు.
దీంతో ఏకంగా తన స్నేహితుల వద్దకు వెళ్లి తనకు లాటరీ తగిలిందని అంటూ సరదాగా జోక్ చేసాడు.
అయితే సరిగ్గా అదే రోజే లాటరీ ఫలితాలను విడుదల చేయగా అందులో అనంతు విజయన్ లాటరీ నెంబర్ కి జాక్ పాట్ తగిలింది.
ఇందులో భాగంగా దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుమతులను అనంతన్ విజయ్ గెలుచుకున్నాడు.
కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో ఈ విషయంపై స్పందించినటువంటి కొందరు నెటిజన్లు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటుంటే కచ్చితంగా మనకు దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?