దేశంలోనే తొలిసారి.. తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట
TeluguStop.com
ప్రస్తుత రోజులలో అన్ని విషయాలలో టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు.అది ఎంతలా అంటే.
చివరకు పిల్లలను కూడా కనే విధంగా టెక్నాలజీస్ వచ్చాయి.అయితే సాధారణంగా సంతాన యోగం ఉండని వారు వివిధ రకాల పద్ధతులతో పిల్లలను కనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే విదేశాలలో ట్రాన్స్ జెండర్ లకు( Transgenders ) ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉంటాయి.
వారు ఆధునిత పద్ధతి ద్వారా పిల్లలను కనడం జరుగుతుంది.ప్రస్తుతం ఈ తంతు మన దేశానికి కూడా వ్యాపించింది.
తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన జియా,( Ziya ) జహాద్( Zahad ) అనే ట్రాన్స్ జెండర్ జంట అమ్మానాన్న అవ్వబోతున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని జియా సోషల్ మీడియా అవార్దికగా పోస్ట్ చేశారు.వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా కలిసి జీవనం కొనసాగిస్తూన్నారు.
"""/" /
వాస్తవానికి జియా తన పుట్టుకతోనే ఒక వ్యక్తి అయితే అతడు తన శరీరంలో రకరకాల మార్పులను ఇటీవల గమనించడంతో దీంతో అతడు లింగమార్పిడి చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు.
దాంతో అమ్మాయిగా మారడానికి సిద్ధమయ్యాడు.ఇక జహాద్ పుట్టగానే అమ్మాయి.
అయితే ఈమెలో మొదటి నుంచి కాస్త పురుషుడు లక్షణాలు ఉండేవి.దీంతో లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో జహాద్ గర్భం( Pregnant ) దాల్చింది.దీంతో వెంటనే వైద్యులు ఆమెకు లింగమార్పిడి ప్రక్రియను నిలిపివేశారు.
దీంతో మన దేశంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన ట్రాన్స్ మెన్ గా జహాద్ నిలిచిపోయాడు.
"""/" /
ఇక ఇప్పటికే వైద్యులు లింగ మార్పిడి ప్రక్రియలో భాగంగా జహాదుకు వక్షోజాలను తొలగించి గర్భాశయాన్ని కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో ఈ ప్రక్రియ కాస్త నిలిచిపోయింది.
ఇది ఇలా ఉండగా మరోవైపు వారికి పుట్టే బిడ్డకు దాతల ద్వారా పాలు అందిస్తామని వారు ఇద్దరు తెలిపారు.
ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ట్రాన్స్ జెండర్ ప్రక్రియ కొనసాగుతుంది.దీంతో పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు లేవని ప్రముఖ వైద్యులు తెలియజేయడంతో పాటు.
ఇదంతా సాధారణ ప్రక్రియ గానే కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు.ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తారా? జగ్మీత్ సింగ్ వ్యూహం ఏంటీ?