వీడియో: బైక్ నంబర్‌ప్లేట్ దాచాలనుకున్న బ్రో.. S24 అల్ట్రా జూమ్‌తో కనిపెట్టేసిన పోలీస్..

ఇండియాలో జనాలు ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) పెద్దగా పాటించరు.అంతేకాదు ట్రాఫిక్ పోలీసుల నుంచి కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు.

వారి ట్రిక్కులు చూస్తే ఎవరైనా సరే అవ్వక అవ్వాల్సిందే.తాజాగా కేరళలో( Kerala ) అలాంటి విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.

బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో వెనకున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు.ట్రాఫిక్ పోలీసులు కంటపడకుండా నంబర్ ప్లేట్‌ను( Number Plate ) దాచేందుకు ఓ రేంజ్‌లో ప్రయత్నించాడు.

కానీ, టెక్నాలజీ ముందు అతడి ట్రిక్స్ పనిచేయలేదు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు కథ ఏంటంటే.ఒక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు.

డ్రైవర్ హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ వెనకున్న వ్యక్తికి హెల్మెట్ లేదు.అంతలోనే ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) కనిపించడంతో టెన్షన్ మొదలైంది.

పోలీసులు ఫొటో తీయకుండా వెనకున్న వ్యక్తి తన చేతిని అడ్డుపెట్టి నంబర్ ప్లేట్‌ను కవర్ చేశాడు.

అప్పుడే సీన్ రివర్స్ అయింది.అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ విజేష్ వి తన శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్‌తో( Samsung Galaxy S24 Ultra ) రంగంలోకి దిగారు.

"""/" / శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? 200MP కెమెరా, పవర్ఫుల్ జూమ్ ఫీచర్లతో విజేష్ క్లియర్ గా నంబర్ ప్లేట్ ఫొటో తీశారు.

దాంతో, నంబర్ ప్లేట్ దాచాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.టెక్నాలజీ ముందు ఎవరి ట్రిక్కులు పనిచేయవని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. """/" / ఈ ఇన్సిడెంట్ తో ట్రాఫిక్ పోలీసుల స్మార్ట్ వర్క్‌, చట్టాన్ని అమలు చేయడంలో టెక్నాలజీ పవర్‌ రెండూ ఒకేసారి బయటపడ్డాయి.

హెల్మెట్ పెట్టుకోవడం, నంబర్ ప్లేట్ కనపడేలా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

రూల్స్ ఫాలో అయితే సేఫ్‌గా ఉండొచ్చు, ఫైన్స్ నుండి తప్పించుకోవచ్చు.ఈ వీడియో చూసిన చాలామంది పోలీసుల టెక్నాలజీ వాడకాన్ని మెచ్చుకుంటున్నారు.

దీన్ని ఇన్‌స్టాలో కూడా షేర్ చేశారు ఆ వీడియోను మీరు ఇక్కడ కింద చూడవచ్చు.

హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు