భారత్‌లో పెరుగుతోన్న పాస్‌పోర్ట్‌దారులు... అగ్రస్థానంలో మలయాళీలు..!!
TeluguStop.com
మారుతున్న కాలమాన పరిస్ధితులు, విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం నేపథ్యంలో ఇటీవలికాలంలో పాస్‌పార్ట్ తీసుకునే భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి.దీని సాయంతో ప్రయాణికుడు ఎవరు.
? ఏ దేశానికి చెందినవాడు.? తదితర విషయాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.
భారతదేశంలో పాస్‌పోర్ట్‌ను పొందేందుకు వీలుగా 93 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రాలు, వాటికి అనుబంధంగా సహాయక కేంద్రాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దౌత్య కార్యాలయాలు భారతీయులకు అందుబాటులో వున్నాయి.
ఇక పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.22 దేశాలకు వీసా లేకుండా భారతీయులు ప్రయాణించవచ్చు.
వీటిలో మూడు దేశాలు (నేపాల్, భూటాన్, మారిషస్) మన పొరుగునే వున్నాయి.అలాగే ఇతర దేశాలకు ప్రయాణించే సౌలభ్యం విషయంలో ఇండియా 69వ స్థానంలో నిలిచింది.
ఈ ఇండెక్స్‌లో భారత్ క్రమంగా తన స్థానాన్ని మెరుగు పరచుకుంటూ వస్తోంది.అయితే తోటి అభివృద్ధి చెందుతున్న దేశాలైన దక్షిణాఫ్రికా (46వ ర్యాంక్), చైనా (59), బ్రెజిల్ (11)లతో పోలిస్తే మనం దిగువన వుండటం గమనించాల్సిన విషయం.
కానీ ఇతర దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్ధితి కాస్త బెటర్. """/"/
ఇదిలావుండగా.
లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 8, 2022 నాటికి భారతదేశంలో 9.
58 కోట్లకు పైగా పాస్‌పోర్ట్‌లు జారీ చేయబడ్డాయి.ఇది దేశ జనాభాలో దాదాపు 7 శాతం.
రాష్ట్రాల వారీగా వస్తే.కేరళలో దాదాపు 1.
13 కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు వున్నాయి.తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులు నిలిచాయి.
రెన్యువల్ చేయని పాస్‌పోర్ట్‌ల సంఖ్య విషయంలోనూ కేరళ తొలి స్థానంలో నిలవగా.తర్వాత తమిళనాడు (8.
84 లక్షలు), కర్ణాటక (7.73 లక్షలు), మహారాష్ట్ర (6.
వారిద్దరూ కేబినెట్‌లో వద్దు .. డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతి నేత హెచ్చరిక