ఉదయం వరకు పేదవాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. ఈ కార్మికుడి లక్కు మామూలుగా లేదు..!

బతుకుదెరువు కోసం రంగులు వేసుకునే ఓ పేద కార్మికుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కోట్లు సంపాదించాడు.అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా.

ఇదంతా ఒక లాటరీ మహిమ అని చెప్పొచ్చు.వివరాల్లోకి వెళితే.

కేరళలోని కొటాయం జిల్లాలో అయ్‌మనం గ్రామంలో సదానందం అనే వ్యక్తి నివసిస్తున్నాడు.పొట్ట గడవడానికి ఇతడు రంగుల పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే ఆదివారం రోజు కుటుంబ సభ్యుల కోసం మాంసం కొనుగోలు చేసేందుకు బయటికెళ్లాడు.

ఆ సమయంలోనే 'క్రిస్మస్ న్యూఇయర్ బంపర్ లాటరీ' టికెట్‌ను కొన్నాడు.నిజానికి ఆ టికెట్ కు లాటరీ తగులుతుందని అతడు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు.

సదానందం సరిగ్గా ఉదయం 9:30 సమయంలో టిక్కెట్ కొనుగోలు చేయగా.ఐదున్నర గంటల కాలంలో అతడు కొనుగోలు చేసిన టికెట్‌కే భారీ లాటరీ తగిలింది.

దాంతో సదానందం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కోట్లు లాటరీ ద్వారా గెలుపొందాడు.

"""/"/ మొదటిగా ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మికుడు సదానందం ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఇది నిజంగా నిజమేనా అన్నట్లు అతను కాస్త ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడట.XG 217582 అనే టికెట్ లాటరీ ఏజెంట్ సెల్వకుమార్ నుంచి అతను కొనుగోలు చేశాడు.

అయితే వచ్చిన లాటరీ డబ్బులతో ఇల్లు కట్టుకుంటానని.తమ పిల్లలు చేసిన అప్పులు తీరుస్తాను అని చెబుతున్నాడు.

"""/"/ దేవుడి దయ వల్ల ఇంత మొత్తంలో డబ్బులు గెలుచుకున్నానని చెబుతున్నాడు.ఆదాయపు పన్ను, కమిషన్ అన్ని ఫోను అతనికి రూ.

7 కోట్ల 39 లక్షలు దక్కనున్నాయి.అయితే అనూహ్యంగా భారీ మొత్తంలో సంపద వస్తుండటంతో సదానందం భార్య రాజమ్మ కూడా చాలా సంతోషిస్తున్నారు.

త్వరలోనే సదానందం ప్రైజ్ విన్నింగ్ టికెట్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ కు హ్యాండోవర్ చేస్తారు.

తర్వాత డబ్బులు అందుకుంటారు.కేరళ లాటరీ శాఖ క్రిస్మస్, న్యూఇయర్ బంపర్ టికెట్స్ ను దాదాపు 50 లక్షలు వరకు విక్రయించింది.

విజయవాడ లో పసుపుజాతర