వైరల్: తొండంతో ఒకరిని లేపి విసిరి పారేసిన ఏనుగు, 24 మందికి పైగా తీవ్ర గాయాలు!

సోషల్ మీడియా గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇప్పుడు జనాలు బాహ్యప్రపంచం కంటే కూడా ఎక్కువగా ఆన్లైన్ సోషల్ మీడియా ప్రపంచంలోనే కాలక్షేపం చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇక్కడ ఎన్నో రకాల కంటెంట్ వైరల్ అవుతూ జనాలకు మంచి టైం పాస్ చేస్తుంది.

అయితే జనాలు ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా చూస్తారు కాబట్టి, ఆయా సంబంధిత కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఒకటి ప్రస్తుతం జనాలకు భయాన్ని కలిగిస్తోంది.

అవును.ఇక్కడ కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా, ఇంకొన్ని చాలా భయాన్ని కలిగించేవిగా ఉంటాయి.

ప్రస్తుతం ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సర్కిల్ అవుతోంది. """/" / విషయం ఏమిటంటే.

కేరళ రాష్ట్రం లోని( Kerala ) తిరుర్, మలప్పురంలో( Malappuram ) పుత్తియంగడి పండగలో జరిగిన ఒక భయానక సంఘటనలో, బిపి అంగడి నేర్చాలో వార్షిక నైవేద్యం చేస్తున్న సమయంలో ఏనుగు( Elephant ) నియంత్రణ కోల్పోవడంతో పెద్ద ప్రమాదమే జరిగింది.

ఆ సమయంలో ఏనుగు ఒక్కసారిగా జనాల పైకి దూసుకెళ్లడంతో మావటి దానిని అదుపు చేయలేక చతికిల పడ్డాడు.

దాంతో ఈ ఘటనలో మొత్తం 24 మంది గాయపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మతపరమైన కార్యక్రమంలో భాగమైన ఏనుగు అకస్మాత్తుగా పరుగెత్తడంతో గందరగోళం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

"""/" / ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జనవరి 8న ఉదయం 12:30 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది.

ఇక్కడి వీడియోని గమనిస్తే.వీడియోలో ఏనుగు ఒక వ్యక్తిని తన తొండంతో పట్టుకుని, గాలిలో ఊపుతూ, ఒక్క సరిగా పక్కకి విసిరేయడం మనం గమనించవచ్చు.

దాంతో అక్కడికి హాజరైనవారిలో భయాందోళనలకు దారితీసింది.దాంతో గుంపు భయంతో పారిపోవడంతో, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

ఎందుకంటే వారి వెంబడే ఆ ఏనుగు కూడా పరుగులెత్తడం జరిగింది.దాంతో కొంత ధననష్టం కూడా వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ సంఘటనపై ప్రస్తుతం స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాడు పొట్ట చేత పట్టుకుని అమెరికాకి.. నేడు కంపెనీకి అధినేత, ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ