దుబాయ్‌లో మూడు నెలల క్రితం మిస్ అయ్యాడు.. చివరికి చెట్టుకు వేలాడుతూ!

ఎన్నో కలలతో, కోటి ఆశలతో దుబాయిలోకి అడుగు పెట్టి కెరీర్ ప్రారంభించిన ఒక యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

తమ ఇంటికి అండదండగా నిలుస్తాడని అనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

విదేశానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడు అనుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని వారు కంటతడి పెట్టుకుంటున్నారు.

వారి కన్నీరుని చూసి స్థానికులు చలించిపోతున్నారు. """/" / వివరాల్లోకి వెళితే.

కేరళకు చెందిన అమల్ ఎనిమిది నెలల క్రితం దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు.

అయితే అతను 2022, అక్టోబరు 20న సాయంత్రం తన గది నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

అతని స్నేహితులు, ఇతరులు అతని కోసం వివిధ ప్రదేశాలలో వెతికారు.కానీ ఫలితం లేకపోయింది.

అతని కుటుంబం, స్నేహితుల ఫిర్యాదు ఆధారంగా దుబాయ్ పోలీసులు కూడా కేసును దర్యాప్తు చేశారు.

అయితే, అతను మూడున్నర నెలలు కనిపించకుండా పోయాడు. """/" / దురదృష్టవశాత్తు, అమల్ మృతదేహం రషీదియాలోని నిర్జన ప్రాంతంలో ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

అతడు చెట్టుకు తాడు వేసి దానికి ఉరి వేసుకొని చనిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ప్రస్తుతం అతని మృతదేహం మార్చురీలో ఉంది.అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అమల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తామని సామాజిక కార్యకర్తలు కుటుంబానికి తెలియజేశారు.

ఆ యువకుడు ఎందుకు చచ్చిపోయాడు అనే వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?