ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యం, మండిపడుతున్న సర్కార్
TeluguStop.com
ఒకపక్క కేరళ లో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అక్కడి ఐఏ ఎస్ అధికారి నిర్లక్ష్యం పై ప్రభుత్వం సైతం మండిపడుతుంది.
కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా క్వారంటైన్ పాటించాలి అంటూ ప్రభుత్వాలు ఊదరగొడుతుంటే అధికారులు సైతం వాటిని లక్ష్య పెట్టకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కు గురిచేస్తుంది.
కేరళ లో అనుపమ్ మిశ్రా అనే ఒక ఐఏఎస్ అధికారి సింగపూర్ వెళ్లి ఇటీవల తిరిగి వచ్చారు.
అయితే కేరళలోని కొల్లం జిల్లాకు చేరుకున్న ఆయన అక్కడ నుంచి చెప్పా పెట్టకుండా తన సొంత సిటీ అయిన యూపీ లోని కాన్పూర్ కు వెళ్లారు.
వాస్తవానికి విదేశాల నుంచి వచ్చిన వారు తప్పని సరిగా 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ వెళ్లాల్సి ఉంటుంది అని ప్రభుత్వాలు హెచ్చరిస్తుండగా అధికారులు కూడా వాటిని లెక్క చేయకుండా ఇలా వెంటనే కేరళ నుంచి యూపీ కి వెళ్లడం తో కేరళ ప్రభుత్వం మండిపడుతుంది.
ప్రభుత్వం ఆదేశించిన ప్రోటోకాల్ పద్ధతిని పాటించకుండా మిశ్రా కాన్పూర్ ని విజిట్ చేశాడు.
అయితే తన పెళ్లి తరువాత సెలవులో ఉన్న మిశ్రా .మలేసియా కూడా వెళ్లాడని తెలిసింది.
కొల్లం జిల్లాలో సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇతనిది చాలా బాధ్యతారాహిత్య ప్రవర్తన అని, ఏదో ఒక చర్య తీసుకుంటామని మత్స్య శాఖ మంత్రి జె.
మెర్సికుట్టి అమ్మ అంటున్నారు.అసలు కొల్లం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
ఈ దృష్ట్యా మిశ్రా కారణంగా కరోనా పాజిటివ్ ఏ వ్యక్తికైనా సోకే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12 మంది రోగులను డిశ్చార్జి చేయగా, వీరిలో ఇద్దరు బ్రిటిషర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
కళ్లముందే నరకం: కార్చిచ్చులో చిక్కుకున్న స్నేహితులు.. భయానక వీడియో వైరల్..