కేరళ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఉద్యోగులు అలా చేయాల్సిందే..!
TeluguStop.com
భారతదేశంలో వరకట్నం తీసుకోవడం నేరం.ఒకవేళ కట్నం తీసుకుంటే వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి.
అయితే, భారతీయ సమాజంలో నేటికీ వరకట్నం కొనసాగుతోంది.అంతటా ఇది ఒక ఆచారం లాగా సాగుతోంది.
ఈ క్రమంలో వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు గాను కేరళ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోంది.
అదేంటంటే.కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని మేల్ ఎంప్లాయిస్ తాము వరకట్నాన్ని ప్రొత్సహించొద్దని, తీసుకోకూడదని స్పష్టం చేసింది.
తాము మ్యారేజ్ చేసుకున్న నెల రోజుల్లో ఈ మేరకు తాము పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ హెడ్స్‌కు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
సదరు డిక్లరేషన్ ఫాంలో మ్యారేజ్ చేసుకున్న మేల్ క్యాండిడేట్ భార్య సంతకంతో పాటు వధువు, వరుడి తండ్రి సంతకం ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేసింది.
ఈ మేరకు కేరళ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
కేరళ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాల నేతలు, ఎన్జీవోలు, మానవ హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేరళలో ఏటా నవంబర్ 26న వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/07/Kerala-male-govt-employees-to-submit-‘no-dowry’-declarations-after-marriage!--jpg"/
ఇక ఈ సర్క్యులర్ కేవలం ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే కాకుండా ప్రైవేటు వారికి వర్తించనుంది.
ఈ మేరకు ప్రైవేటు, స్వయం ప్రతిపత్తి కలిగిన ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు ఆయా శాఖల ఉద్యోగులు సైతం డిక్లరేషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ 26న స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయాలని సర్కారు సూచించింది.
గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని కేరళ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించిన సంగతి అందరికీ విదితమే.
ఈ నేపథ్యంలో కట్నం తీసుకునే వాడు గాడిద అని కేవలం ప్రకటనలు, ప్రచారం చేసే బదులుగా ఆచరణలో తన వంతు కృషి చేస్తున్న కేరళ సర్కారుకు పలువురు హక్కులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వామ్మో.. రోజుకు ఒక కప్పు స్వీట్ కార్న్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?