ఉమెన్ చాందీకి యూ‌డి‌ఎఫ్ కూటమి భాద్యతలు

కేరళ లో త్వరలో అసెంబ్లి ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికార పార్టీ ని ఓడించేందుకు కాంగ్రెస్ సారథ్యంలో యూ‌డి‌ఎఫ్ కూటమిగా ఏర్పడయి.

ఈ నేపథ్యంలో యూ‌డి‌ఎఫ్ కూటమి బాద్యతలను ఉమెన్ చాందీ కు అప్పగిస్తున్నట్లుగా ఏ‌ఐ‌సి‌సి చైర్మెన్ సోనియా గాందీ నిర్ణయం తీసుకున్నారు.

యూ‌డి‌ఎఫ్ కూటమిలో మొత్తం 10 మంది నాయకులు పార్టీ వ్యూహరచన చేస్తారు.వారికి ఉమెన్ చాందీ నాయకత్వం వహిస్తాడు.

ఈ పది మంది సభ్యుల్లో కేరళ పి‌సి‌సి అధ్యక్షుడు ఎం.రామచంద్రన్‌, ప్రతిపక్ష నేత రమేశ్ చేన్నితాల,ఏ‌ఐ‌సి‌సి సంస్థాగత కార్యదర్శి కే‌సి వేణుగోపాల్, తారిక్ అన్వర్ తదితర నేతలు ఉన్నారు.

వీరందరు డిల్లీ లోని సోనియా గాందీ నివాసంలో రాహుల్ గాందీ మరియు సోనియా తో సమావేశం అయ్యారు.

కేరళ అసెంబ్లి ఎన్నికల్లో యూ‌డి‌ఎఫ్ కూటమి విజయం సాదించిన తర్వాతే సి‌ఎం అభ్యర్థిని ప్రకటిస్తాంని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏ‌కే ఆంటోని సమావేశం అనంతరం తెలిపాడు.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి