యూకే సార్వత్రిక ఎన్నికలు : చరిత్ర సృష్టించిన కేరళ సంతతి వ్యక్తి.. నర్స్ నుంచి ఎంపీగా..!!

ఇటీవల ముగిసిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో( UK General Election ) భారతీయులు సత్తా చాటారు.

బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 26 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.

అలాగే తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.

అన్నింటిలోకి పంజాబీ మూలాలున్న అభ్యర్ధులు ఈసారి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.రికార్డు స్థాయిలో 12 మంది పంజాబీ సంతతి నేతలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు.

ఈ సంఖ్య 2019లో ఐదుగా ఉండేది.ఈ క్రమంలో కేరళ సంతతికి చెందిన సోజెన్ జోసెఫ్( Sozen Joseph ) చరిత్ర సృష్టించారు.

నర్స్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన యూకే ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.కెంట్ కౌంటీలోని యాష్‌ఫోర్డ్ నియోజకవర్గంలో( Constituency Of Ashford ) లేబర్ పార్టీ అభ్యర్ధిగా జోసెఫ్ గెలిచారు.

కన్జర్వేటివ్ పార్టీ నేత డామియన్ గ్రీన్‌ను ఆయన ఓడించారు.139 ఏళ్ల లేబర్ పార్టీ చరిత్రలో యాష్‌ఫోర్డ్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఇంత వరకు గెలవలేదు.

ఇప్పుడు జోసెఫ్ ఆ కొరతను తీర్చారు. """/" / కేరళలోని కొట్టాయం జిల్లా కైపుజా అనే చిన్న గ్రామానికి చెందిన జోసెఫ్ .

కెంట్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో మెంటల్ హెల్త్ ( Mental Health In The Kent National Health Service )నర్స్‌గా పనిచేస్తున్నారు.

యూకే ఎన్నికల్లో తన కుమారుడు విజయం సాధించినట్లు తెలుసుకున్న జోసెఫ్ తండ్రి కేటీ జోసెఫ్, అతని ముగ్గురు సోదరీమణులు, బంధుమిత్రులు స్వగ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

తాను చాలా సంతోషంగా ఉన్నానని.ఒక మలయాళీ యూకేకు వెళ్లి గెలిచాడని ఇప్పటికీ జోసెఫ్ రోజూ ఇంటికి ఫోన్ చేస్తాడని కేటీ జోసెఫ్ చెప్పారు.

"""/" / ఎన్నికల్లో జోసెఫ్‌ పోటీ చేస్తున్నట్లు తెలియడంతో అతని విజయం కోసం ప్రతిరోజూ ప్రార్ధించినట్లు తెలిపారు.

2001లో బెంగళూరులో నర్సింగ్ పూర్తి చేసిన జోసెఫ్.2002లో బ్రిటన్‌కు వెళ్లి అక్కడి వైద్య రంగంలో సేవలందిస్తున్నారు.

ఆయన చివరిసారిగా మూడు నెలల క్రితం తల్లి ఎలికుట్టి మరణించడంతో కేరళ వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

జోసెఫ్ భార్య బ్రిటా కూడా కేరళలోని త్రిసూర్‌కు చెందిన నర్స్.ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, వీరి కుటుంబం ప్రస్తుతం కెంట్‌లో నివసిస్తోంది.